ఓ వ్యక్తి రూ.500 లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో లక్నోలోని ఒక పోస్ట్‌మ్యాన్ పౌరుడి పాస్‌పోర్ట్ పేజీని చించేశాడు. బాధితుడు ఆ పోస్ట్‌మాన్‌ను నిలదీస్తూ రికార్డ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రతి పోస్ట్‌కు పోస్ట్‌మాన్ రూ.100 డిమాండ్ చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.