విశాఖ జిల్లా భీమిలిలో యువకుడి వేధింపులకు ఓ టీచర్ ప్రాణం తీసుకుంది. తనను ప్రేమించాలని ఓ యువకుడు టీచర్‌గా పనిచేసే రాశి అనే అమ్మాయిని తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో రాశి ఈ నెల 16న ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యలు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించింది. అయితే రాశి మృతిని భీమిలి పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం.