ఏపీలోని కూటమి ప్రభుత్వం శనివారం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారెంటీ నియమాలను స్వల్పంగా సవరిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. 2018లో తెచ్చిన పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ రూల్స్ సవరిస్తున్నట్లు వెల్లడించింది. లిఫ్టులు, ఎస్కలేటర్ల, ఉత్పత్తి లైసెన్సులను 15-21 రోజుల్లో జారీ చేసేలా మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది.