ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితి ఎత్తివేత

68பார்த்தது
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితి ఎత్తివేత
ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో విజయవాడలో 8,700, విశాఖలో 8,400 ఆటో రిక్షాలకు మాత్రమే అనుమతి ఉండేది.

தொடர்புடைய செய்தி