బైకర్‌ని ఢీకొట్టి తొక్కుకుంటూ వెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ (వీడియో)

66பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బైకర్‌ను ఓ లారీ తొక్కుకుంటూ వెళ్లింది. మహారాజ్‌గంజ్‌లోని మోహన్‌పూర్ గ్రామ సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్‌పూర్ గ్రామానికి చెందిన తౌకీర్‌గా గుర్తించారు.

தொடர்புடைய செய்தி