సమాజంలో శాంతిభద్రతలు కాపాడటంలో డయల్ 100 సేవలు కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయం నుండి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో పని చేస్తున్న బ్లూ కోర్ట్స్, పెట్రో కార్, కంట్రోల్ రూమ్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఆపదలో వున్న వారు డయల్ 100 కు ఫోన్ చేస్తారని, సమయం వృథా చేయకుండా వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయం అందించాలని చెప్పారు.