డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఐద్వా జిల్లా నాయకురాలు సమ్రీన్ మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు అంటూ చెప్పి రూపాయి వసూలు చేసిందని, వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పారు.