కొల్లాపూర్ లో వణికిస్తున్న చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ఓ వైపు పొగ మంచు కమ్మేస్తుండగా.. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరగడంతో వాకర్స్, ప్రజలు, చిన్నారులు చలి మంటలు పెట్టుకొని సేద తీరుతున్నారు. చలి మంటలతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు మంగళవారం సూచిస్తున్నారు.