అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.