కల్వకుర్తిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని లబ్ధిదారులు సోమవారం కల్వకుర్తి ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. 18 నెలల క్రితం లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేసి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శ్రద్ధ వహించి పెండింగ్ పనులు పూర్తి చేయించారని తెలిపారు. ఇప్పటికైనా ఇండ్ల పట్టాలు త్వరగా పంపిణీ చేయాలన్నారు