ఉట్కూర్: బారులు తీరిన పత్తి వాహనాలు

56பார்த்தது
ఉట్కూర్ మండలం తిప్రాస్ పల్లి లోని ఓ కాటన్ మిల్లు వద్ద పత్తి లోడ్ తో వున్న వాహనాలు కిలోమీటరు పొడవునా మంగళవారం నిలిచిపోయాయి. రైతులు రెండు రోజులుగా రోడ్లపై వున్నారు. కొందరు రైతులు అక్కడే పళ్లు తొముతు, ముఖాలు కడుగుతూ కనిపించారు. సమయానికి కొనుగోళ్లు చేయకపోవడంతో వాహనాల అద్దె భారంగా మారుతోందని, రోజుల తరబడి రోడ్లపై వుండాల్సిన పరిస్థితి వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி