రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి నివాసానికి చేరుకొని పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.