కల్వకుర్తి అగ్రికల్చర్ మార్కెట్ నూతన పాలకవర్గం నియామకం
కల్వకుర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని శుక్రవారం నియమించింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాక మనీలా, వైస్ చైర్మన్ గా దేశినేని పండితరావు, కమిటీ మెంబర్లుగా మెరుగు నారాయణ రెడ్డి, పాలెపు కొండల్, పాతులావత్ భీమ్లా నాయక్, పసుల రమాకాంత్ రెడ్డి, కేశమల్ల కృష్ణయ్య, చెర్క రాజశేఖర్, షేక్ ముస్తఫా, కానుల యాదయ్య, సయ్యద్ అన్సుద్దిన్ లు నియమించబడ్డారు.