వనపర్తి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలను పూర్తిస్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో మాట్లాడుతూ.. 2018-19లో స్వయం ఉపాధి కొరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 39 యూనిట్ల పూర్తి వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.