లగచర్లలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడడంతోనే రేవంత్ సర్కార్ పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని మంగళవారం జెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గప్రసాద్ ఆరోపించారు. నరేంద్ర మోడీ భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో మొదటి వరుసలో నిలిపి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.