AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత తుఫానుగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.