జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో జీపుజాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకురాలు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పోరేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా చట్టాలు చేస్తుందని, ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచుతున్నారని, పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ నెల 26న జిల్లా కేంద్రంలో నిరసనలు చేపడతామన్నారు.