మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం, ఆలూరు గ్రామంలో బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, బీసీ సేన మండల కార్యదర్శి గొడుగు నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీసేన కార్యకర్తల సమావేశంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ శుక్రవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. యువకులు విద్యపై ఆసక్తి పెంచుకొని ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా జీవించాలని గ్రామానికి మంచి పేరు తేవాలని యువతకు సూచించారు.