మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీసీ సేన నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీలను పథకాలకే పరిమితం చేస్తారా అని పాలనలో భాగస్వామ్యం కల్పించరా అని ప్రశ్నించారు. బీసీలకు కావాల్సింది డిక్లరేషన్ కాదు వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 60 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.