జడ్చర్లలో ఉదయం ఏడు గంటలు దాటిన మంచు విపరీతంగా కురవడంతో జడ్చర్ల నుంచి నాగర్ కర్నూల్ వెళ్లే రహదారి మంచుతో కమ్ముకుంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా చోట్ల వాహనదారులు తమ ప్రయాణాలను విరమించుకున్నారు. మంచు దట్టంగా కమ్ముకున్నప్పుడు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.