ఎస్సీ వర్గీకరణలో 57 ఉపకులాలను చేర్చి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించి, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఉప కులాలకు అన్యాయం చేస్తే మరో పోరాటానికి సిద్ధం అని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేష్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలు, ఉపకులాల సుదీర్ఘ పోరాటంవలనే సాధ్యం అయ్యిందని అన్నారు.