తెలంగాణ రాష్ట్ర టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. లండన్ పర్యటనలో భాగంగా బుధవారం పాలమూరు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి లండన్ లో ఉన్న టూరిజం ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నల్లమల టూరిజాన్ని ప్రపంచ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.