జడ్చర్ల నియోజకవర్గ స్థాయి మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో ఎమ్మెల్యే శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల తరహాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎక్కడా అవినీతి జరగకుండా నిఘా పెట్టాల్సిన బాధ్యత కూడా మహిళా సంఘాలదేనని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పూర్తిగా అర్హులకే అందాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అలాంటి అవకతవకలు, జరగకుండా చూసుకోవాలన్నారు.