చిట్యాల ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి రెండు సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జడ్చర్ల పట్టణంలో నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశానికి జాతీయ ఉపాధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర అధ్యక్షులు గోపి, కో కన్వీనర్ బండలయ్య హాజరయ్యారై మాట్లాడారు. వర్ధంతి వరకు విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు.