రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.