ఆరెకటికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పలు సమస్యలపైన తెలంగాణ సచివాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజారాం, యం. నర్సింలు, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.