దేవరకద్రను మున్సిపాలిటీగా గుర్తించాలని సీఎంకు ఎమ్మెల్యే వినతి

60பார்த்தது
దేవరకద్రను మున్సిపాలిటీగా గుర్తించాలని సీఎంకు ఎమ్మెల్యే వినతి
మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న దేవరకద్రను మున్సిపాలిటీగా గుర్తించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. బుధవారం సీఎం నివాసంలో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు భూసేకరణ పూర్తి చేసినట్లు వెంటనే మంజూరు చేయాలని, నూతనంగా కోర్టును మంజూరు చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు.

தொடர்புடைய செய்தி