దేవరకద్ర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్. డి ఫారూఖ్, ఉపాధ్యక్షులుగా కురువ జహాహర్, పి. జగన్మోహన్ రెడ్డి, శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థాన చైర్మన్ బి. నరసింహా రెడ్డి నియమిస్తూ శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో దేవరకద్ర పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.