అయిజ మున్సిపాలిటీలో పెరిగిన జనాభా దృష్ట్యా వార్డుల సంఖ్యను పెంచాలని అయిజ మున్సిపాలిటీ కమిషనర్ కి శనివారం వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు. భారతీయ జనతా పార్టీ అయిజ పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన జనాభా దృష్ట్యా అయిజ పురపాలక సంఘం పరిధిలో ఉన్న 20 వార్డులను 30 వార్డులుగా పెంచుటకు పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక తీర్మానం చెయ్యాలన్నారు.