ఒడిశాకు చెందిన బీజేడీ మాజీ ఎమ్మెల్యే బిజయ కుమార్ మొహంతి(60) కన్నుమూశారు. ఇవాళ తన గెస్ట్ హౌస్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించి.. ఆస్పత్రికి తరలించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. ఆయన 2009 నుంచి 2019 వరకు ఒడిశా అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్, సీనియర్ నాయకులు అశోక్ చంద్ర పాండా, తదితరులు భౌతికదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు.