ఆప్ అధినేత కేజ్రీవాల్ రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చెందగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని లూథియానా నుంచి ఆయన పోటీచేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.