కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లా జెవర్గి తాలూకాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెలోగి సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను వాజిద్, మెహబూబి, ప్రియాంక, మెహబూబ్‌లుగా గుర్తించారు, వీరంతా బాగల్‌కోట్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.