AP: గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు (YCP) తన పదవికి శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మరో ఎన్నిక అనివార్యమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా డిప్యూటీ మేయర్ అధ్వర్యంలో కౌన్సిల్ అత్యవసర భేటీ జరగనుంది. సమావేశంలో మేయర్ ఎన్నిక కోసం తీర్మానం చేసి.. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. తీర్మానం అనంతరం ఈసీ మేయర్ ఎన్నిక తేదీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.