భారత్‌కు చెందిని ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ ఆదివారం అదుపులోకి తీసుకున్నది. మత్స్యకారులతో పాటు రెండు పడవలను సైతం స్వాధీనం చేసుకున్నది. పట్టుబడిన మత్స్యకారులు తమిళనాడులోని రామనాథపురానికి చెందిన వారు. మత్స్యకారులు మండపం నుంచి సముద్రం వైపు వెళ్లి పాక్ బే ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్నట్లు నేవీ అధికారులు ఆరోపించారు. సరిహద్దు దాటి వచ్చారని నేవీ పేర్కొంది.