ఉప్పు లేని వంటకాలను ఎవరూ తినలేరు. అయితే ఆహారంలో ఉప్పు అధికంగా తింటే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుందతి. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇక తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఉప్పు ఎక్కువగా తినే వారిలో హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తేలింది. దీని వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 41 శాతం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.