ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇంకా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి, కణజాలాలను రక్షిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అస్థమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.