పరగడుపునే పండ్ల రసాలు తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "పండ్లను జ్యూస్ చేసే క్రమంలో చక్కెర కలిపి పరగడుపునే తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి మరింతగా పెరిగి.. దీర్ఘకాలంలో మధుమేహ ముప్పును పెంచే అవకాశం ఉంది. అలాగే వీటిలోని ఆమ్లత్వం దంతాలపై ఉండే ఎనామిల్ పొరను తొలగిస్తుంది. దానిమ్మ, ద్రాక్ష, బ్లూబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లలో ఉండే ఆమ్లత్వం జీర్ణాశయ గోడల్ని దెబ్బతీస్తుంది." అని నిపుణులు చెబుతున్నారు.