పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు విధులను పూర్తిగా పక్కనబెట్టి మరోసారి నిరసనబాట పట్టారు. వైద్యులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై గత రెండు నెలలుగా అక్కడి వైద్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో సీఎం మమతా బెనర్జీతో చర్చల అనంతరం పాక్షికంగా విధుల్లో చేరిన వారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని మళ్లీ నిరసనకు దిగారు.