శరీరంలో పొటాషియం, కాల్షియం వంటి లోపం వల్ల తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్, మద్యం కారణంగా తిమ్మిర్ల సమస్య అధికంగా వస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా వచ్చే వారు నీటిని ఎక్కువగా తాగాలి. చెమట వచ్చేలా వ్యాయామం చేయాలి. రోజూ కాసేపు నడవాలి. పొటాషియం అధికంగా ఉంటే ఆహారాలను తీసుకోవాలి.