కర్ణాటక రాష్ట్రంలోని తుమ్‌కూర్ జిల్లాలో ఉన్న శని దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శని దేవుడు తన వాహనమైన కాకిపై కూర్చుని భక్తులకు దర్శనమిస్తాడు. జాతకంలో ఏలిన నాటి శని, అర్థాష్టమ శని వంటి శని దోషాలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వారి సమస్యలు పరిష్కారమవుతాయని పురోహితులు చెబుతున్నారు. ఈ నమ్మకంతో శని దేవుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.