డయాబెటిస్ వచ్చిన పదేళ్లలో కచ్చితంగా కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే జువెనైల్ డయాబెటిస్ అంటే పుట్టుకతోనే షుగర్ ఉన్నవారికి కంటిచూపు సమస్యలతో పాటు మానసిక, శారీరక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. 40 ఏళ్లు దాటిన వారితో పాటు, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లయితే ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఇప్పుడు యాంటి గ్లకోమా చికిత్స అందుబాటులో ఉంది.