TG: మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యింది. అలాగే కులగణనలో కూడా ఫెయిల్ అయింది. బీసీల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ప్రపంచంలో దేశం ముందు ఉండాలి. అంటే బీజేపీ కి ఓటు వేయండి అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.