యూపీలో ఘోరమైన ఘటన జరిగింది. బరేలీలోని ఢిల్లీ హైవేలో మీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటుక బట్టీ చిమ్నీ కూలిపోయింది. శిథిలాల కింద చాలా మంది కార్మికులు చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపక దళం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురిని రక్షించగా, మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.