రాజస్థాన్ లోని గరాసియా తెగకి చెందిన మహిళలు వింత ఆచారం పాటిస్తున్నారు. ఇక్కడ ప్రతి మహిళ తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయవచ్చు. ఒకవేళ బాగస్వామి నచ్చకపోతే మరో వ్యక్తిని ఎంచుకునే హక్కు ఉంది. ప్రతియేడు ఈ తెగ ప్రజలు ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. స్త్రీలు ఈ సంతలోనే తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని, వారితో సహజీవనం చేస్తారు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చితే ఆ జంట పెళ్లి చేసుకోవాలనేది ఈ తెగ సంప్రదాయం.