TG: హైదరాబాద్ లోని ఆశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పది నిమిషాలు మీతో మాట్లాడటానికి టైమ్ ఇవ్వండని సీఎం రేవంత్ రెడ్డిని ఓ గ్రూప్–1 అభ్యర్థి వేడుకున్నాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. 'సీఎం సార్ ఎందుకు మమల్ని కలవడం లేదు. మేము ఎందుకు మా సీఎంతో మాట్లాడడానికి ఇంత కష్ట పడాలి. మాకు ఒక 10 నిమిషాలు టైమ్ ఇవ్వండి. మా బాధలు మీతో చెప్పుకుంటాం' అంటూ చెప్పుకొచ్చారు.