తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నెలకు రూ. 18,500 కోట్లు ఉండగా.. రూ. 6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలకు, రూ. 6500 కోట్లు ఉద్యోగుల జీతాలకు వెళ్తాయని అన్నారు. మిగిలిన రూ. 5500 కోట్లతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు.