కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ఖండించారు. సోషల్ మీడియాలో తనకు రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని కేసీఆర్ చెప్పడంపై వ్యంగ్యంగా స్పందించారు. 'ఆ మధ్య సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కంటే రాఖీసావంత్‌కే ఎక్కువ లైక్స్ వచ్చాయి.. అంతామాత్రానా సల్మాన్ ఖాన్ స్టార్ కాకుండా పోతాడా' అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్‌కు ఇంకా సిగ్గురాలేదని ఫైర్ అయ్యారు.