కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో 2025-2026 రబీ సీజన్ కు సంబంధించిన గోధుమ పంటపై కూడా మద్దతు ధరను పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గోధుమలకు క్వింటాలకు రూ.150ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.