వికలాంగ పోస్టులపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పోస్టులను కాలానుగుణంగా గుర్తించడానికి కమిటీలను వేయాలని ఆదేశించింది. ఈ మేరకు కనీసం 40 శాతం వైకల్యం ఉన్న వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు, పోస్టుల గుర్తింపును క్రమబద్దీకరించడానికి గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఏదైనా పోస్టు వారికి సరిపోతుందని భావిస్తే తదుపరి ప్రమోషనల్ పోస్టులు వారికి రిజర్వు చేయాలని తెలిపింది. వైకల్య నిర్ధారణకు ఏకరీతి మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలంది.