తెలంగాణ కులగణన చారిత్రాత్మక నిర్ణయం అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 'ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా తెలంగాణలో కులగణన జరిగింది. 50 రోజుల్లోనే 97 శాతం ప్రజలు కులగణనలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఓటరు జనాభాకి, సర్వే లెక్కలకు పొంతన కుదరలేదు. దీనికి ప్రధాన కారణం ఒక్కొక్కరూ రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం' అని గుత్తా తెలిపారు.